రాగం రసమయ వేదమై స్వరసంచారములను చేయగా
తానం తకథిమి తాళమై తనువంతా పులకలు రేపగా
అనుపల్లవి:
ప్రతి స్వరం వరం ప్రణం ప్రణవ శుభకరం పదం పలికితే
సుమధురం నిరంతరం హృదయ లయస్వరం గళం కలిపితే
త్యాగరాజ పంచరత్నమే కాదా
విన్నవారి జన్మధన్యమైపోదా
చరణం:
పాడనా తీయగా ఎనాడెవ్వరూ విననీ
గానమే ఊపిరై నాలో మెదిలే కథనీ
ఉయ్యాలలూగే కనుపాపలో కలనీ
నా పాటతోనే జత కలిపి ఆడనీ
సరిగమలే వాటి వరమై నలుగురికీ నాదస్వరమై
భావం రాగం తాళం ఆలాపించే గీతం
ఎదురు నిలిచి సొగసు చిలికి మనసు గెలవనీ